భారత్ సమాచార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: శామీర్ పేట చెరువు దగ్గర ఛాత్ పూజ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. బీహార్, యూపీ సమాజం దీపావళి పండుగ ఆరు రోజుల తర్వాత.. నాలుగు రోజుల పాటు ఛాత్ పూజ చేసుకుంటారు. శని, ఆది, సోమ మంగళవారాల్లో ఈ పూజ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ‘సూర్య భగవానుడికి పూజ చేసి శక్తి ఇవ్వాలని ఆశీర్వాదం అందించాలని మీరంతా పూజలు చేస్తున్నారు. హైదరాబాదులో మాత్రమే కాదు దేశమంతా బీహార్, యూపీ, బెంగాల్ వారు విస్తరించి ఉన్నారు. నిర్మాణరంగంలో ఎక్కువమంది బిహారినే పనిచేస్తున్నారు. తెలంగాణ పల్లెల్లో పొలం పనులు కూడా బిహారిలే చేస్తున్నారు. డైరీఫాంలో , కాటన్, మిర్చి, రైస్ మిల్స్, కన్స్ట్రక్షన్ లలో పని చేసేవారు ఎవరున్నారు అంటే అది యూపీ, బీహార్ వాళ్ళే. కరోనా సమయంలో నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను. ప్రతిరోజు వేలమంది ప్రజలు నడుచుకుంటూ ఉత్తర భారత దేశానికి వెళ్తామని బయలుదేరు . అప్పుడే అర్థమైంది దాదాపు 17 లక్షల మంది ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. దేశాభివృద్ధిలో మీ పాత్ర మరువలేనిది. మేడిన్ ఇండియాను నిజం చేసి చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కి మీ అండదండలు అవసరం. ఎన్నికలలో హామీ ఇచ్చినట్లు మీకు ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటాను. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు’ అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు విక్రంరెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, మల్లికార్జున్, శ్రీకాంత్ రెడ్డిలు, బిహారీ సమాజం నుంచి ప్రమోద్ శర్మ, తికధర్ యాదవ్, భావేష్ యాదవ్, నరేంద్ర సింగ్, ముని లాల్ శర్మ, బిపిన్ శర్మ, సురేష్ శర్మ, దీపక్ పాండే తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
28, అక్టోబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్