భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమర వీరులను స్మరించుకుంటూ తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఘనంగా నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ చౌరస్తా నుండి తూప్రాన్ పెద్ద చెరువు కట్ట వరకు 2కే రన్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఎస్పీ నరేందర్ గౌడ్, “పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టి ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్నారు. యువత కూడా పోలీసులకు తోడ్పాటు అందించి సమాజ భద్రత, శాంతి, శ్రేయస్సు కోసం కృషి చేయాలి” అని పిలుపు నిచ్చారు.డ్రగ్స్, గుట్కా, జూదం వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండి మంచి పౌరులుగా మారాలని, సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసులకు సహకరించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం అందించాలని యువతకు సూచించారు. 2కే రన్లో తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల నుండి సుమారు వెయ్యి మంది యువత, పోలీస్ సిబ్బంది, గీతా కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ 2 కే రన్ పోటీలో మొదటి స్థానం లో తూప్రాన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సలక్షన్ గౌడ్,
ద్వితీయ స్థానం శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి మధు తేజ, తృతీయ స్థానం గీతా కాలేజీ విద్యార్థి సాయి తేజ దక్కించుకున్నారు. విజేతలకు డీఎస్పీ నరేందర్ గౌడ్ చేతుల మీదుగా మెమెంటోలు బహుకరించి సన్మానించగా, అన్ని పాల్గొన్న యువతకు మెడల్స్ అలంకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సి.ఐ రంగ కృష్ణ, ఎస్.ఐ శివానందం, ఎస్.ఐ (2) యాదగిరి, మనోహరాబాద్ ఎస్.ఐ సుభాష్ గౌడ్, వెల్దుర్తి ఎస్.ఐ రాజు, యువ నాయకులు ఇస్లాంపూర్ సంతోష్ రెడ్డి, కిష్టాపూర్ మహమ్మద్ హమ్మద్, వెంకటాయపల్లి లంబ రమేష్ యాదవ్, సతీష్ చారి, బిజెపి అధ్యక్షులు భూమన్నగారి జానకిరామ్ గౌడ్, ఇమామ్ పూర్ నవీన్ గౌడ్, గీతా కాలేజీ ప్రిన్స్ పాల్ రాజు, లెక్చరర్స్ అశోక్, రాజు, యాదగిరి, ప్రవీణ్, సీనియర్ జర్నలిస్ట్ లు లయన్ డాక్టర్ జానకిరామ్, అర్.శివశంకర్ గౌడ్, వి.శివకృష్ణ గౌడ్, నవీన్, చిరంజీవి తోపాటు నాలుగు మండలాల యువకులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
మెదక్ అభివృద్ధికి అధికారుల సమన్వయం అవసరం: ఎమ్మెల్యే