భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమర వీరులను స్మరించుకుంటూ తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఘనంగా నివాళులు అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ చౌరస్తా నుండి తూప్రాన్ పెద్ద చెరువు కట్ట వరకు 2కే రన్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఎస్పీ నరేందర్ గౌడ్, “పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టి ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్నారు. యువత కూడా పోలీసులకు తోడ్పాటు అందించి సమాజ భద్రత, శాంతి, శ్రేయస్సు కోసం…