భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మొంథా తూపాన్ తో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ పార్లమెంటు టిడిపి కన్వీనర్ ఇళ్లేందుల రమేష్ అన్నారు. జిల్లాలో మొంథా తూపాన్ తో పంట పొలాలు కి నీరు వచ్చి చేతికొచ్చిన పంట మొత్తం నాశనం అయ్యిందని దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని మెదక్ పార్లమెంటు టిడిపి కన్వీనర్ ఇళ్లేందుల రమేష్ తెలిపారు.ముఖ్యంగా జిల్లా లో సిద్ధిపేట డివిజన్ లో సదాశివపేట ,కొండాపూర్,నారాయణ్ ఖేడ్,రాయికోడ్ తదితర మండలాల్లో పెద్ద ఎత్తున చేతికొచ్చిన పత్తి ,వరి పంటలు మొత్తం చేన్లలోకి నీరు వచ్చి మొత్తం నాశనం అయ్యి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని, వీరందరికి ప్రభుత్వం తరపున ఎకరాకు కనీసం 20 వేల రూపాయలు చెల్లించి ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.ఉమ్మడి జిల్లా లో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని తెలిపారు.మార్కేట్ యార్డులో ధాన్యం వర్షానికి కొట్టుకుపోయిందని కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా తెలిపారు.
మరిన్ని కథనాలు:
మెదక్లో ‘ప్రజావాణి’: 4 ఫిర్యాదులు స్వీకరించిన అదనపు ఎస్పీ