భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

తల్లిదండ్రుల ఆవేదనను ఆలకించండి.. విద్యార్థులకు భద్రత కల్పించండి

f5216aa3-17b5-4152-8c79-d4e26f82db98

భారత్ సమాచార్, ఖమ్మం: పిల్లలు పాఠశాలకు వెళితే ఆనందపడాల్సిన తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యే పరిస్థితి మధిర మండలం తొర్లపాడు గ్రామంలో నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామంలోని పాఠశాలకు చెందిన రెండు గదుల భవనం పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. గోడల పెచ్చులు ఊడి పడడం, వర్షాకాలంలో పాఠశాల భవనం మరింత ప్రమాదకరంగా ఉండడంతో పిల్లలను పాఠశాలకు పంపించాలంటే భయంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాల ప్రహరీ గోడ దుస్థితి అధ్వానంగా ఉండడంతో పాములు, విష పురుగుల బెడద ఎక్కువగా ఉందని, విద్యార్థులకు ఎప్పుడు ఎం జరుగుతుందోనని గ్రామస్తులు వాపోయారు. ఇటువంటి పాఠశాలలో గతంలో ఐదుగురుగా ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 15 మందికి చేరడం గమనార్హం. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో తొర్లపాడు పాఠశాలకు యువ ఉపాధ్యాయులు రావడం, వారి ప్రత్యేక శ్రద్ధతోనే ఇది సాధ్యమైందని గ్రామస్థులు ప్రశంసించారు. కాగా తొర్లపాడు గ్రామానికి 6km దూరములో ఇతర ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడంతో తొర్లపాడు ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చి గ్రామీణ విద్యార్థులకు చదువును మరింత దగ్గర చేయాలని స్థానికులు కోరారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఉన్నతాధికారులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకొని పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించాలని, 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలను 7వ తరగతి వరకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తమ పిల్లల్ని పాఠశాలకు పంపించమని తేల్చి చెబుతున్నారు.