భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

జాతీయ సమైక్యతలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి: అవినాష్ కుమార్

4168f628-0a69-4a7a-82cc-dd6a0b4ed6d1

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: కుల, మత, వర్గ, లింగ బేధాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ పిలుపునిచ్చారు. భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం భైంసా పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ హాజరయ్యారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని స్థానిక నిర్మల్ బైపాస్ రోడ్డులో గల గ్రౌండ్ వద్ద 2కే రన్ ను నిర్వహించారు. ఈ 2కే రన్ లో పట్టణ ప్రముఖులు, పోలీసులు విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు భారతదేశ ఐక్యత, సమగ్రత భద్రతను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా భైంసా ఏఎస్పీ మాట్లాడుతూ… భైంసా డివిజన్ లోని అన్ని పోలీస్ స్టేషన్లో రాష్ట్రీయ ఏక్తా దివస్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐక్యత స్పూర్తితో భైంసాలో శాంతిని నెలకొల్పేలా ప్రజలు కృషి చేయాలని భైంసా టౌన్ సీఐ గోపీనాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పి.కాశీనాథ్, పట్టణ ప్రముఖులు, యువత, పట్టణ వాసులు, విద్యార్థులు పాల్గొన్నారు.