భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: కుల, మత, వర్గ, లింగ బేధాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలని భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ పిలుపునిచ్చారు. భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం భైంసా పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ హాజరయ్యారు. జాతీయ ఐక్యత…