భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

ఘనంగా ఇండక్షన్ డే, గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు

13

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ గ్రాడ్యుయేషన్ డే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కళాశాలలో ఇండక్షన్ డే, గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కే విష్ణు రాజు వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ రమేష్, ఆర్ ఎన్ డి దిన్ డాక్టర్ వివిఎస్ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఫార్మసీ రంగం పట్ల ఫార్మసీస్టులకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గురించి వారికి ఉన్నటువంటి అవకాశాలను గురించి ఎన్నో విషయాలను కొత్తగా కళాశాలలో చేరుతున్నటువంటి విద్యార్థులకు చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ A. రమేష్ మాట్లాడుతూ వైపర్ కళాశాలకు సంబంధించి, కళాశాలకు ఉన్నటువంటి అధునాతన సదుపాయాల గురించి ఈ కళాశాలలో చదువుకుంటే కలిగేటటువంటి ఎన్నో రకమైనటువంటి లాభాల గురించి విద్యార్థులకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా అర్థమయ్యేటటువంటి విధంగా ఎన్నో వివరాలను తెలియజేసారు. ఇట్టి కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది . అదేవిధంగా ఫార్మసీ విద్యను పురస్కరించుకొని బయటికి వెళ్తున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ శ్రీను బాబు మాట్లాడుతూ సమాజంలోకి ఫార్మసిస్టులుగా బయటకు వెళ్తున్నటువంటి విద్యార్థులకు ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలను తెలియజేసారు. ఫార్మసీకున్నటువంటి ప్రాముఖ్యతను వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు నిర్వహించాల్సిన బాధ్యతను తెలియజేసారు.