భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ

1

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని బోధన్ పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీఐ వెంకటనారాయణ నేతృత్వంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల త్యాగాలను స్మరించారు. కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో ఇందూర్, విజయ సాయి పాఠశాలల, విద్యా వికాస్, ఉషోదయ కళాశాలల నిర్వాహకులు కొడాలి కిషోర్, కృష్ణమోహన్, వై.శ్రీనివాస్, దుష్యంత్, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని, త్యాగాల వల్లే ప్రజలు శాంతి, భద్రతలతో జీవిస్తున్నారని తెలిపారు.

మరిన్ని కథనాలు: 

నిజామాబాద్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు