భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ అసెంబ్లీలో పలు ప్రాంతాలలో ఏదైతే తుఫాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టపోవడం, ఎండబెట్టిన వడ్లు నీటిలో తడిచిపోవడం వంటివి జరుగుతున్న విషయం తెలిసిందే. కావున బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ వడ్లు తడిచిపోయిన ప్రాంతానికి వెళ్లడం జరిగిందన్నారు. వారు మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలంటే వడ్లు తడిచిపోయాయి. రైతుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని ఈ వడ్లను కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, యువ మోర్చా అధ్యక్షులు ప్రేమ్, పట్టణ మాజీ అధ్యక్షులు బబ్బూరి కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శులు రామ్ రెడ్డి,సంగసాని రాజు, కార్యదర్శి ప్యాటా నగేష్, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
బాల్య వివాహాల రహిత జిల్లాగా మెదక్ జిల్లా: కలెక్టర్