భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, నవంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

తూప్రాన్ లో ఉచిత షుగర్ పరీక్షా శిబిరం

WhatsApp Image 2025-11-02 at 10.31.07 PM

భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా : తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుష్మా హాస్పిటల్ ఆవరణలో ఆదివారం ఉదయం ఉచిత షుగర్ పరీక్షా శిబిరం లాంఛనంగా ప్రారంభమైంది. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పల్లెర్ల రవీందర్ గుప్త శిబిరాన్ని ప్రారంభిస్తూ, మధుమేహం ఒక “సైలెంట్ కిల్లర్” వంటిదని, దానిని క్రమం తప్పకుండా పరీక్షించుకుని నియంత్రణలో ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సాధారణ స్క్రీనింగ్ క్యాంప్ ప్రతిరోజూ కొనసాగుతుందని, అయితే ప్రతి ఆదివారం ప్రత్యేక “మేఘా క్యాంప్” నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రోగ్రామ్ చైర్మన్ బుడ్డ భాగ్యరాజు మధుమేహం లక్షణాలను వివరిస్తూ, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండటం దీనికి కారణమన్నారు. డాక్టర్ ప్రదీప్ సింహ మాట్లాడుతూ.. అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, అలసట వంటి లక్షణాలు సూచనలు కావచ్చని అన్నారు. డాక్టర్ జానకిరామ్ సి.ఆర్. మాట్లాడుతూ, మానసిక ప్రశాంతత, వ్యాయామం, సమయపాలన ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని సూచించారు.

మ‌రిన్ని క‌థ‌నాలు :

పేదల పాలిట “భక్షకులు”గా హైడ్రా – ఎమ్మెల్యే సునీతా