భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలి

WhatsApp Image 2025-11-03 at 7.33.53 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్: పెండింగ్‌లో ఉన్న రూ. 8,500 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తూప్రాన్ శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తాలో నిరసన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కార్తికేయ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నాయకులు వైన్ టెండర్లపై చూపుతున్న శ్రద్ధ విద్యార్థులపై లేదని ఆయన మండిపడ్డారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే తమ పోరాటం ఆగదని, అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు పోరాడుతామని ఏబీవీపీ హెచ్చరించింది.

మ‌రిన్ని క‌థ‌నాలు

కాంగ్రెస్​తోనే అభివృద్ధి సాధ్యం: సుహాసిని రెడ్డి