భారత్ సమాచార్.నెట్, మెదక్: పెండింగ్‌లో ఉన్న రూ. 8,500 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తూప్రాన్ శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తాలో నిరసన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కార్తికేయ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నాయకులు వైన్ టెండర్లపై చూపుతున్న శ్రద్ధ విద్యార్థులపై లేదని ఆయన మండిపడ్డారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే…