భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

పెండింగ్ డీఆర్‌సీ విడుదల చేయాలని డిమాండ్

WhatsApp Image 2025-11-03 at 7.40.58 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్: పెండింగ్‌లో ఉన్న డీఆర్‌సీలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ బకాయిలను చెల్లించి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 7న ‘చలో హైదరాబాద్’ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా తూప్రాన్ మండల శాఖ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి. మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్. విద్యాసాగర్ తదితరులు గోడ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని వారు కోరారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

తూప్రాన్ కోర్టు మరమ్మతులకు రూ.15 లక్షల హామీ