భారత్ సమాచార్.నెట్, మెదక్: పెండింగ్‌లో ఉన్న డీఆర్‌సీలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ బకాయిలను చెల్లించి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 7న ‘చలో హైదరాబాద్’ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా తూప్రాన్ మండల శాఖ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి. మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్. విద్యాసాగర్ తదితరులు గోడ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని వారు కోరారు.
మరిన్ని…





