భారత్ సమాచార్, హైద్రాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడా, ఎల్లారెడ్డిగూడా కాలనీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతి గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాదయాత్ర, భారీ ర్యాలీ నిర్వహించారు. “ప్రజా ప్రభుత్వం – ప్రజా పాలన – మన కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర రూపురేఖలను మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే పార్టీ, రిజర్వేషన్లు భాగంగానే నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమవంతు బాధ్యతగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ బిజెపి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు, ఫేక్ మీడియా ద్వారా అసత్యపు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో విజయ రమణారావు, ఎడమ బుజ్జి, కార్పొరేటర్స్, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొనారు.
BHARATH SAMACHAR DIGITAL
6, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్