భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ కమాన్ వద్ద గల లావీష్ ఓక్ పేరుగల ఓయో రూంలో అఖిల్ (31) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామచంద్రాపురం సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న అఖిల్ (31) ఈ నెల 10న ఓయో రూం తీసుకున్నాడు. అదేరోజు సాయంత్రం వేళ తన తండ్రి సంగీత్ రావుకు ఫోన్ చేసి క్రికెట్ బెట్టింగ్ లో మోసపోయానని చెప్పాడు. తన తండ్రి సంగీత్ ఇంటికి రావాలని, వచ్చాక మాట్లాడుతానని చెప్పాడు. ఇంటికి వస్తానని అఖిల్ మెసేజ్ చేశాడు. ఈ క్రమంలో అఖిల్ కోసం తండ్రి సంగీత్, ఫ్రెండ్స్ వెతుకుతున్నారు. ఈ క్రమంలో లావీష్ ఓక్ ఓయో రూం వారు ఆర్సీపురం పోలీసులకు సమాచారం అందించి రూం డోర్ తీయడం లేదని చెప్పగా అక్కడకు వెళ్లి డోర్, అద్దాలు పగలగొట్టి కుటుంబ సభ్యుల సమక్షంలో లోపలకు వెళ్లారు. అఖిల్ రూంలోనే ఫ్యాన్ కు టవల్ తో ఉరేసుకుని మృతి చెందడంతో మృతదేహాన్ని కిందకు దించారు. తండ్రి సంగీత్ రావు ఫిర్యాదు మేరకు ఆర్సీపురం ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అఖిల్ మృతి పట్ల తండ్రి సంగీత్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
BHARATH SAMACHAR DIGITAL
12, నవంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్