భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

విజయవంతంగా ముగిసిన ధర్మదీక్ష పోరాటం

35

భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: రాష్ట్ర జేఏసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ధర్మదీక్ష పోరాటం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రెండు జిల్లాల ఇన్చార్జి బుర్ర సోమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ “మణుగూరు పట్టణంలో నిర్వహించిన దీక్ష విజయవంతంగా ముగిసిందన్నారు. మా బీసీ జేఏసీ దీక్షకు మద్దతు తెలిపిన మాకు మొదటి నుండి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన మణుగూరు పట్టణం, కాపు సంఘం,  సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారికి. న్యూ డెమోక్రసీ, వివిధ కుల సంఘాల వారికి, మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.  ఎప్పుడు మీ అండ దండలు అందించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాము.  జై బీసీ, జై జై బీసీ, బీసీ జేఏసీల ఐక్యత వర్ధిల్లాలి, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి” అని అన్నారు.