భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: దుమ్ముగూడెం మండలం నర్సాపురం రైతు వేదికలో భద్రాచలం శాసన సభ్యులు
తెల్లం వెంకట్రావు అద్వర్యంలో సమావేశం నిర్వహించారు. నడికుడి రెగ్యులేటర్(39.80 కి.మీ) కింద గల ఆయకట్టు రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు బొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తాలిపేరు ప్రాజెక్ట్ ఎడమ కాలువపై పనుల నిర్వహణ, రెండవ పంటకు నీటీ పంపిణీ అంశాల గురించి చర్చించారు. తమ వాటా ప్రకారం ఈసారికి మూడో జోన్ కి నీరు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో ఎల్డి 4 ఎల్ డి ఫైవ్ కాలువలకు రిపేర్లు చేయించాలని, తొలకరి పంట కూడా ఈ కాలువల ద్వారా రైతాంగానికి సరైన నీరు అందక నష్టపోతున్నామని ఎమ్మెల్యేకు, ఈఈ కు తెలియజేశారు. అలాగే కిలోమీటర్ కెనాలకు సంబంధించిన లీకేజీలు రిపేర్ చేపిస్తే తాలిపేరు ఆయకట్టు చివర రైతాంగని కూడా నీరు అందుతుందని వారి దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వం గానీ, ఇప్పటి ప్రభుత్వం గానీ రైతు ప్రభుత్వాలు అని చెప్తున్నారు కానీ రైతాంగానికి కావలసిన తాలిపేరు పనులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత పది సంవత్సరాలు కాలంలో తూరుబాక ప్రాంతంలో నీరు రాక కాలువలు కూడా పూడిపోయినయి అని అధికారులు వెంటనే ఈ విషయంపై దృష్టి పెట్టే విధంగా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో యాస శ్రీనివాస్ రెడ్డి, వర్శ చిన్నారావు, సోడి శ్రీనివాసరావు, కాటబోయిన వెంకటేశ్వర్లు కాటేబోయిన సత్యం గుండె సత్యం గుర్రం వెంకటేశ్వర్లు, వేల్పు సింగయ్య, వేల్పు పంచమి రావు, కుంజా వెంకటేశ్వర్లు, కురసం అర్జున, తిరుపతి రావు, చలపతి, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
14, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్