భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ ఏకచక్ర అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్య అన్నదాన భిక్షా కార్యక్రమాన్ని శుక్రవారం బోధన్ ఎసిపి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు పల్లంపాటి శివ నారాయణ తెలిపారు. స్వాములకు ప్రతిరోజూ భిక్షా ఏర్పాట్ల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు. ఈ కార్యక్రమం కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్, పావులూరు వెంకటేశ్వరరావు, మాటూరి ప్రసాద్, చల్లా శ్రీనివాసరావు, రమేష్ బ్రహ్మయ్య గౌడ్ పర్యవేక్షణలో సాగనుంది. జనవరి 5 వరకు నిత్యం భిక్షా కార్యక్రమం కొనసాగుతుందని, భక్తులు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని, దాతలు సహకరించాలని ట్రస్ట్ కమిటీ విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో ఎమ్మార్వో విఠల్, ఎలక్ట్రిసిటీ ఏఈ నాయిని కృష్ణ, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
15, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్