భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: MHSRB ఇటీవల కాలంలో నిర్వహించిన MPHAW (F), ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్స్ ఫలితాలను వెంటనే వెల్లడించాలని, 7 నెలల PRC బకాయిలను వెంటనే చెల్లించాలని, 2 నెలల వేతనాలను చెల్లించడంతోపాటు ప్రతినెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేసారు. అశ్వాపురం మండల కేంద్రంలో నాయకులు మాట్లాడుతూ బకాయిలను చెల్లించని యడల ది. 17-11-2025 నుండి నిరవధిక సమ్మె చేస్తామని ముందుగా అశ్వాపురం మండల ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ సంకీర్తనకి ANM, MLHP లు సమ్మె పత్రం అందజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “గత కొంతకాలం నుండి నేషనల్ హెల్త్ మిషన్ పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలకు సంబంధించిన విషయంలో తరచుగా జాప్యం జరుగుతుంది. ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదినే గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు విడుదల చేస్తున్నారు. కానీ తక్కువ జీతానికి పనిచేస్తున్న కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ప్రతినెలా ఒకటవ తేదీన జీతాలు అందడం లేదు. ఒకవైపు శాలరీ విషయంలో వారు తీవ్రమైన వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో జీతాలు చెల్లించడంలో కూడా ఇంత వివక్షలో చూపడం ఏమాత్రం సమంజసం కాదనేది మా అభిప్రాయం. ప్రతినెల వారు చెల్లించవలసిన EMI లు పెండింగ్లో పడి చెక్కు బౌన్స్ అవుతున్నాయి. తద్వారా వారి యొక్క CBIL స్కోర్ పడిపోతుంది. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్సనల్ లోన్ తో పాటు ఇతర టోన్స్ ఏదేని గ్యారంటీలోనే ఇస్తున్నారు. ఇటువంటి సమయంలో వారి యొక్క CBIL స్కోర్ తగ్గినయెడల మరలా వారు లోన్ తీసుకోవడానికి అనర్హులు అవుతారు. వారి అత్యవసరమైన సమయంలో వారు తీవ్ర ఇబ్బందుల పడే అవకాశం ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన వేతనాలు ఇంతవరకు అందలేదు. కావున తమరు ఇట్టి విషయాన్ని పరిశీలించి ప్రతి నెల ఒకటవ తేదినే జీతాలు చెల్లించేలా గ్రీన్ ఛానల్ ద్వారా ఏర్పాట్లు చేయగలరని తెలంగాణ రాష్ట్ర NHM కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్| AITUC) గా కోరుకుంటున్నాము. రెండు నెలల వేతనాలను చెల్లించడంతో పాటు గతంలో హామీ ఇచ్చిన హామీ ప్రకారం 7 నెలల PRC వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ఈనెల 10వ తేదీ వరకు వేతనాలు చెల్లించని ఎడల ది.17- 11- 2025 నుండి నిరవధిక సమ్మె చేస్తామని తమరికి తెలియజేస్తూ దీనినే సమ్మె నోటీసుగా పరిగణించవలసిందిగా కోరుకుంటున్నాము” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిర, భిక్షమమ్మ,నాగమణి, శారద,రాజేశ్వరీ, దేవి, రాజ్యలక్ష్మి, భవాని, రాములమ్మ, రాజేశ్వరీ, శైలజ, వెంకటనరసమ్మ, స్వర్ణ, వెంకమ్మ, ప్రియ, మౌన్య,పూర్ణ,ప్రియ, అనిత,తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
16, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్