భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్ :
➨ తెలంగాణ రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.
➨ భారీ వర్షాల వల్ల పంట నష్టం జరిగిందనే మనస్తాపంతో ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన మండలానికి చెందిన ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
➨ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం.. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.
➨ రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మరో రెండు రోజులు గజగజ వణకాల్సి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా.
➨ క్షమించండి.. మా సేవలు శాశ్వతంగా నిలిపివేశాం – ఐబొమ్మ
➨ భళా సజ్జనార్.. అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చారు: డిప్యూటీ సీఎం పవన్
➨ ఏపీ లో బీసీ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన కూటమి ప్రభుత్వం
➨ గోషామహల్లో కుంగిన 5 అంతస్తుల భవనం
➨ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అంతర్జిల్లా బదిలీలపై ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు..
➨ హీరో మహేశ్ బాబు కారు PVNR ఎక్స్ప్రెస్ వేపై స్పీడ్ లిమిట్ దాటడంతో పోలీసులు రెండుసార్లు ఫైన్ విధించారు.
➨ ఢిల్లీ పేలుడు ఘటనలో మరో కీలక నిందితుడు అరెస్ట్.. కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వానీని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ..
➨ సౌదీ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సహా 45 మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు, మృతుల్లో హైదరాబాదీలు కూడా ఉన్నారు.
➨ సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన (భారతీయుల) కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
➨ మహారాష్ట్రలోని వాసాయిలో దారుణ ఘటన జరిగింది. టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ కారణంగా.. ఓ 13 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది.
➨ బెంగళూరుకు చెందిన మహిళ నుంచి సైబర్ మోసగాళ్లు రూ.31.83 కోట్లు దోచుకున్నారు.
➨ అమ్మకపుదారులకు ఊరట కల్పిస్తూ, రూ. 1,000 లోపు ఉత్పత్తులకు జీరో కమిషన్ ప్రకటించడానికి ఫ్లిప్కార్ట్ సిద్ధమవుతోంది.
➨ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
➨ షేక్ హసీనా కేసులో తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ అంతటా మరోసారి హింస చెలరేగడంతో హై అలర్ట్ ప్రకటించారు.
➨ రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం సుంకాలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
➨ వెరిజోన్ టెలికాం కంపెనీ 15 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది.