భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

రెండు పశువైద్యశాలలు ప్రారంభం

WhatsApp Image 2025-11-17 at 4.16.27 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్: మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతోందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. సోమవారం ఆయన పాపన్నపేట మండలం, చికోడు, నాగసానిపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రెండు పశువైద్యశాల భవనాలను ఘనంగా ప్రారంభించారు.

నియోజకవర్గంలో పశువైద్య సేవలను బలోపేతం చేసే లక్ష్యంతో, ప్రతి భవనాన్ని రూ.20 లక్షల చొప్పున, మొత్తం రూ.40 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వీటిని నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నూతన భవనాల్లో అన్ని వసతులు కల్పించి, డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండి పశుపక్షాదులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి వెంకటయ్య, పంచాయతీరాజ్ డీఈ పాండురంగారావు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.