భారత్ సమాచార్.నెట్, మెదక్: మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతోందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. సోమవారం ఆయన పాపన్నపేట మండలం, చికోడు, నాగసానిపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రెండు పశువైద్యశాల భవనాలను ఘనంగా ప్రారంభించారు.
నియోజకవర్గంలో పశువైద్య సేవలను బలోపేతం చేసే లక్ష్యంతో, ప్రతి భవనాన్ని రూ.20 లక్షల చొప్పున, మొత్తం రూ.40 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వీటిని నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నూతన భవనాల్లో అన్ని వసతులు…





