భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, నవంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

కర్నూలులో చోరీ నిందితుడు అరెస్ట్: రూ. 9.25 లక్షల సొత్తు రికవరీ

WhatsApp Image 2025-11-18 at 4.08.36 PM

భార‌త్ స‌మాచార్.నెట్, కర్నూలు జిల్లా : సి.బెళగల్ పోలీసులు చోరీ కేసును ఛేదించారు. తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన నిందితుడు గిర్ని వెంకటేష్ (45)ను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం నిందితుడిని గుట్టల నాగమ్మ గుడి వద్ద పట్టుకుంది.

 

నిందితుడి నుంచి 9 తులాల బంగారం, 55 తులాల వెండి, రూ. 1 లక్ష నగదు సహా మొత్తం రూ. 9.25 లక్షల విలువైన సొత్తును పోలీసులు రికవరీ చేశారు. సెప్టెంబర్ 25న జరిగిన చోరీపై సీసీ కెమెరా ఫుటేజీలు, పాత నేరస్తుల వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. రికవరీ చేసిన సొత్తును కోర్టు ద్వారా యజమానులకు అప్పగిస్తామని, నిందితుడిపై పాత కేసులు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.