భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, నవంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

రాష్ట్రస్థాయి క్రీడలకు ఆత్మకూరు విద్యార్థుల ఎంపిక

4c72ba8b-3702-4f8d-b504-d09a9c0f4821

భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పలువురు విద్యార్థులు ఈ నెల 20నుంచి 23వరకు జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని సి.శివకీర్తి అండర్-17 విభాగంలో సైకిల్ ఇన్ మాస్ ట్రాక్ క్రీడకు ఎంపికైంది. పద్మావతి హైస్కూల్‌కు చెందిన యన్. హారిక అండర్-14 విభాగంలో మాస్ ట్రాక్ క్రీడలో ప్రాతినిధ్యం వహించనుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎం.హర్షవర్ధన్, ఈ.వెంకటేశ్వర్లు అండర్-14, అండర్-17 వర్గాల్లో గ్రౌండ్ ఫస్ట్ సైక్లింగ్ కు ఎంపికయ్యారు. యోగాలో అద్భుత ప్రతిభ కనబరిచి అండర్-17 విభాగంలో షేక్ షాహిద్ ఆఫ్రిది, అండర్-14 విభాగంలో కే.సాయి వితుర్ణ రాష్ట్రస్థాయి కోసం అర్హత సాధించారు. విద్యార్థుల ఎంపికపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవానంద్, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీడీ మహేశ్వరి బాయి, మహబూబ్, సైక్లింగ్ కోచ్ ఉప్పల సాయి తేజ పాల్గొన్నారు.