భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: ఆదోని జిల్లాగా, పెద్దహరివాణం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు డిమాండ్ చేశారు. పెద్దహరివాణం మండల సాధన కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బీసీ ఫెడరేషన్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆదోని వెనుకబడిన ప్రాంతం కావున జిల్లా, మండల హోదా అవసరమని పేర్కొన్నారు. ఇది ఏ పార్టీ కోసం కాదని, ఆదోని అభివృద్ధి కోసం అన్ని పార్టీలు గళం విప్పాలని అన్నారు. జిల్లాలపై ప్రభుత్వం ఉపసంఘం ఏర్పాటు చేసినప్పటికీ ఆదోని ప్రాంతాన్ని సందర్శించలేదని విమర్శించారు. వెంటనే ఆదోని జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తగిరి నాయుడు, సాయి బాబా, దేశెట్టి ప్రకాష్, కత్తి హనుమంతరావు, పి. శేక్ షావాలి, బెస్త ప్రకాష్, కత్తి ప్రసాద్, ఎం. వీరభద్ర, నల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
19, నవంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్