భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: ఆదోని జిల్లాగా, పెద్దహరివాణం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు డిమాండ్ చేశారు. పెద్దహరివాణం మండల సాధన కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు బీసీ ఫెడరేషన్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆదోని వెనుకబడిన ప్రాంతం కావున జిల్లా, మండల హోదా అవసరమని పేర్కొన్నారు. ఇది ఏ పార్టీ కోసం కాదని, ఆదోని అభివృద్ధి కోసం అన్ని పార్టీలు గళం విప్పాలని అన్నారు. జిల్లాలపై ప్రభుత్వం ఉపసంఘం ఏర్పాటు చేసినప్పటికీ ఆదోని ప్రాంతాన్ని…