భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

పొగమంచు వాతావరణంలో వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ రోహిత్

39

భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా:  శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ బాగా తగ్గుతుంది. వాహనదారులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  ఒక ప్రకటనలో తెలియజేశారు.  వాహనదారులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు తెలిపారు. తెల్లవారుఝామున దట్టమైన పొగమంచు కురిసే సమయంలో ప్రయాణాలు చేయడం శ్రేయస్కరం కాదని, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. వాహనాలను నిదానంగా నడపాలని, వేగంగా వెళ్లడం అత్యంత ప్రమాదకరమన్నారు.మీ వాహనం యొక్క ఫాగ్ లైట్లు, పార్కింగ్ లైట్లతో పాటు తక్కువ-బీమ్ హెడ్‌లైట్లను మాత్రమే ఉపయోగించాలని, హై-బీమ్ లైట్లు పొగమంచులో మరింత ప్రతిబింబించి,విజిబిలిటీని తగ్గిస్తాయని తెలిపారు. కారులో హీటర్ ను ఆన్ చేసుకుని,ఎల్లప్పుడూ అద్దాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందు వెళుతున్న వాహనానికి కనీస దూరాన్ని పాటిస్తూ,ఆ వాహన సిగ్నల్స్ ను గమనిస్తూ ఉండాలని, పొగమంచు అధికంగా కురిసే సమయంలో ఓవర్ టేక్ చేయడం మంచిది కాదన్నారు. అత్యవసరంగా రోడ్డు ప్రక్కన ఆగాల్సి వస్తే, రోడ్డుకు దూరంగా ఆపి,హజార్డ్ లైట్లను వేసి ఉంచాలని సూచించారు.