భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: కౌతాళం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అల్లూరి వెంకటపతి రాజు ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ సాధనకు సహకార సంస్థలే శక్తివంతమైన వాహనాలు అని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధినే సహకార సంఘాల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్న వెంకటపతి రాజు, సహకార వ్యవస్థ బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సంఘం ద్వారా రైతులకు అర్హతను బట్టి రుణాలు, ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలు సేవలను పారదర్శకంగా అందిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తక్కువ వడ్డీపై రైతులకు రుణాలు లభిస్తున్నాయి. క్రాప్ లోన్లను సకాలంలో చెల్లిస్తున్న రైతులకు వడ్డీ రాయితీ సమయానుకూలంగా అందుతున్నందున సంఘం మరింత బలపడుతోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ నభిసాబ్, సీఈఓ వెంకటేష్, టిడిపి టౌన్ అధ్యక్షుడు డాక్టర్ రాజానంద్, టిడిపి నాయకులు నరసప్ప, గొట్టయ్య, నభి, సుభాన్, అలాగే సొసైటీ సిబ్బంది బసవరాజు, జాఫర్, జక్రయ్య, రాము మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
20, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్