భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: కౌతాళం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అల్లూరి వెంకటపతి రాజు ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ సాధనకు సహకార సంస్థలే శక్తివంతమైన వాహనాలు అని పేర్కొన్నారు. రైతుల అభివృద్ధినే సహకార సంఘాల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్న వెంకటపతి రాజు, సహకార వ్యవస్థ బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సంఘం ద్వారా రైతులకు అర్హతను బట్టి రుణాలు, ఎరువులు, విత్తనాలు,…