భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బైంసా పట్టణంలోని భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అజ్మీర సాంకేత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.దేవిదాస్ మాట్లాడుతూ ప్రభుత్వాలు, పాలకులు మారిన జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.అక్రిడేషన్ కార్డుల గడువు పెంచకుండా కొత్తవి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలని,అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతోపాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు.అలాగే హెల్త్ కార్డులు,ఇన్సూరెన్స్, రాత్రిపూట మహిళా జర్నలిస్టులకు పనిచేసే చోట నుంచి రవాణా సౌకర్యం కల్పించేలా ఆయా సంస్థలపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తిచేశారు.మీడియాతో పాటు జర్నలిస్టుల పరిస్థితులను అధ్యయనం చేసి పరిషరించేందుకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు.దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సహిల్ జావిద్, జిల్లా ఉపాధ్యక్షులు ఆశమొల్ల మోహన్,జర్నలిస్ట్ లు చరణ్ రెడ్డి,ప్రకాష్,విలాస్, శ్రీనివాస్,మురళి,మాదవ్ రావ్, షకీల్, బషీర్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
21, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్