భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

ఆదోని జిల్లా ఏర్పాటు కోసం దీక్షకు వైసీపీ ఎమ్మెల్యే మ‌ద్ద‌తు

WhatsApp Image 2025-11-22 at 5.41.54 PM

భార‌త్ స‌మాచార్.నెట్, కర్నూలు జిల్లా : ఆదోని జిల్లా ఏర్పాటు, పెద్ద హరివాణం మండలం డిమాండ్‌లపై భీమా సర్కిల్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆదోని, ఆలూరు ప్రాంతాలకు ఆదోని కేంద్రంగా ఉండడంతో, దీన్ని జిల్లాగా ప్రకటిస్తే నాలుగు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. హోళగుంద మండలానికి కర్నూలు దూరం కావడం వల్ల పాలనాపరమైన సేవలు ఆలస్యం అవుతాయని, ఆదోని జిల్లా అయితే పరిపాలనా సేవలు దగ్గరవుతాయని తెలిపారు.

ఆదోని జిల్లా ఏర్పాటుతో సమీప నియోజకవర్గాల అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు అవుతాయి అన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఈ పోరాటంలో పాల్గొనాలని ఆయన సూచించారు. దీక్ష చేస్తున్న వారికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, అవసరమైతే ధర్నాలలో కూడా పాల్గొంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.