భార‌త్ స‌మాచార్.నెట్, కర్నూలు జిల్లా : ఆదోని జిల్లా ఏర్పాటు, పెద్ద హరివాణం మండలం డిమాండ్‌లపై భీమా సర్కిల్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆదోని, ఆలూరు ప్రాంతాలకు ఆదోని కేంద్రంగా ఉండడంతో, దీన్ని జిల్లాగా ప్రకటిస్తే నాలుగు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. హోళగుంద మండలానికి కర్నూలు దూరం కావడం వల్ల పాలనాపరమైన సేవలు ఆలస్యం అవుతాయని, ఆదోని జిల్లా…