భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం

WhatsApp Image 2025-11-22 at 6.05.56 PM

భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, బోధన్ పట్టణం టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కళాశాల (బాయ్స్)లో పోలీస్ కళాబృందం శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. పట్టణ ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు నాటకాలు, పాటల రూపంలో సందేశాలు అందించారు.

ముఖ్యంగా, రోడ్డు భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరి వాడకం, ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అంతేకాక, విద్యార్థులను లక్ష్యంగా చేసుకునే సైబర్ నేరాల మోసపూరిత పద్ధతులు, వాటి నివారణ చర్యలు వివరించారు. డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే ప్రమాదాలపై యువతను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.