భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, బోధన్ పట్టణం టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కళాశాల (బాయ్స్)లో పోలీస్ కళాబృందం శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. పట్టణ ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు నాటకాలు, పాటల రూపంలో సందేశాలు అందించారు.

ముఖ్యంగా, రోడ్డు భద్రత కోసం హెల్మెట్ తప్పనిసరి వాడకం, ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అంతేకాక, విద్యార్థులను లక్ష్యంగా చేసుకునే సైబర్ నేరాల మోసపూరిత పద్ధతులు,…