భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: కరకగూడెం మండలం రేగళ్ల గ్రామపంచాయతీలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను పినపాక శాసనసభ్యులు పినపాక శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి MLA మాట్లాడుతూ “గత పది ఏళ్లలో ఇవ్వని రేషన్ కార్డులు ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి ఒక్కరికి ఆరు కేజీల సన్నబియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ సొంతింటి కలను నెరవేరుస్తుందని తెలిపారు. గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం, 500 కి గ్యాస్ సిలిండర్, వడ్డీ లేని రుణాలు, రెండు లక్షల రూపాయల రుణమాఫీ, రైతు బీమా, రైతుబంధు, వ్యవసాయ రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్య పౌష్టిక ఆహారం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో MRO కాంతారావు. MPO, ప్రభుత్వ అధికారులు, మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
23, నవంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్