భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, నవంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు

2

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ లోని కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఒకసారి గుప్పమన్నాయి. మంగళవారం నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ శివంపేట మండలాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. నర్సాపూర్ లో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం శివంపేటలోని బగలాముఖి అమ్మవారి ఆలయం దర్శనం కోసం వెళుతున్న సమయంలో శివంపేటకు చెందిన నాయకులు ఆయనకు స్వాగతం పలికే సమయంలో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న నవీన్ గుప్తా, సుదర్శన్ గౌడ్ వర్గాల మధ్య నాయకుడికి స్వాగతం పలికే సమయంలో బాహబాహి చోటు చేసుకుంది. ఇరు వర్గాల నేతలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక నేత, పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి తరలించారు. గత కొంతకాలంగా శివంపేటలో కాంగ్రెస్ పార్టీలోని ఇరు వర్గాల మధ్య నిప్పు రాసుకుంటుంది. నేడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముందే ఈ గలాటా జరగడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రేపు ఈ గ్రూపు తగాదాలు పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.