భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, నవంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి: కలెక్టర్

WhatsApp Image 2025-11-25 at 7.37.35 PM

భారత్ సమాాచార్.నెట్, మెదక్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమర్థవంతంగా సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. మంగళవారం డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.

నియమ నిబంధనలపై పూర్తి అవగాహనతో, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్స్, లైటింగ్ వంటి అన్ని సదుపాయాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణ, కౌంటింగ్ సహా అన్ని ప్రక్రియలను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.