భారత్ సమాాచార్.నెట్, మెదక్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమర్థవంతంగా సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. మంగళవారం డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
నియమ నిబంధనలపై పూర్తి అవగాహనతో, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.పోలింగ్ కేంద్రాల్లో…





