భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి

12

భారత్ సమాచార్, యాదాద్రి జిల్లా: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి సైన్స్ పట్ల ఇష్టాన్ని శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించాలని లక్ష్యంతో చెకుముకి ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సూరజు భాస్కర చారి తెలిపారు. బుధవారం మోత్కూరు ఉన్నత పాఠశాల ఆవరణలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి తీపి రెడ్డి గోపాల్ రెడ్డి పరీక్ష పత్రాలను విడుదల చేశారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాల విభాగంలో సెయింట్ ఆన్స్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోత్కూరు మోత్కూరు కస్తూర్బా గాంధీ పాఠశాలతో పాటు గురుకుల పాఠశాల మోత్కూరు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు వారు తెలిపారు. అనంతరం పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.కార్యక్రమంలో దత్తప్పగూడెం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జంగా చారి వివిధ పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులు ఏ వెంకటాచారి సరోజ మధుకర్ రాజు సారంగపాణి అనిత చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.