భారత్ సమాచార్, యాదాద్రి జిల్లా: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి సైన్స్ పట్ల ఇష్టాన్ని శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించాలని లక్ష్యంతో చెకుముకి ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సూరజు భాస్కర చారి తెలిపారు. బుధవారం మోత్కూరు ఉన్నత పాఠశాల ఆవరణలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి తీపి రెడ్డి గోపాల్ రెడ్డి పరీక్ష పత్రాలను విడుదల చేశారు. మండలంలోని వివిధ…