భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

శ్రమ్ కార్డుల నమోదు, అవగాహన కార్యక్రమం

10

భారత్ సమాచార్, కర్నూల్ జిల్లా: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సూచనల ప్రకారం బుధవారపేటలో శ్రమ్ కార్డుల నమోదు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీసెస్ యూనిట్ సభ్యుడు లయన్ డా. రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ అసంఘటిత శ్రామికుల భద్రత, సంక్షేమం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రతి హక్కుదారుడికి చేరవేయడానికి ఈ శిబిరం ప్రత్యేకంగా నిర్వహించబడిందని తెలిపారు. అసంఘటిత కార్మికులకు శ్రమ్ కార్డు ద్వారా లభించే లాభాలు, ప్రమాద బీమా ప్రయోజనాలు, కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, శ్రమ్ కార్డు కలిగిన వారికి ప్రభుత్వం అందించే ₹2 లక్షల ప్రమాద బీమా, అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా అసంఘటిత కార్మికులకు శ్రమ్ కార్డులను జారీ చేశారు. కార్యక్రమంలో సయ్యద్ అబ్బాస్, షేక్ జకియా అక్షరి, బి. రామాంజనేయులు, డి. జేమ్స్, శేషగిరి శెట్టి, విక్రమ్ సింగ్, కూసుపాటి బాబ్జి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కేసన్న, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.