భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలంలో గంధం పోచమ్మ క్షేత్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మజీద్ లీవ్ ఫామ్ కంపెనీ ఆఫీసర్ నిశాంత్ గ్రామ రైతులు వెన్నవరం మోహన్ రెడ్డి, చిత్తరంజన్ దాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగుకు సబ్సిడీ అందిస్తుందన్నారు. చీడపీడల బెడద తక్కువగా ఉంటుందన్నారు. 30 ఏళ్ల వరకు ఆదాయం లభిస్తుంది అన్నారు. బై బ్యాక్ పద్ధతిలో కంపెనీ ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోవడం వల్ల పంట కొనుగోలు కు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఆయిల్ పామ్ తోటలో అంతర్ పంటలు వేసుకొని కూడా ఆదాయం పొందవచ్చు అన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే ఎస్సీ ఎస్టీ రైతులకు డ్రిప్ సిస్టం కు 100% సబ్సిడీ కాగా బీసీలకు 90%, ఇతరులకు 80% రాయితీ లభిస్తుందన్నారు. తక్కువ పెట్టుబడి తో ఎక్కువ ఆదాయం పొందవచ్చు అన్నారు కావున మండలంలోని ఆసక్తిగల రైతులు మరిన్ని విషయాల కొరకు +91 89777 92511 నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించగలరని వారు తెలియజేశారు.
BHARATH SAMACHAR DIGITAL
27, నవంబర్ 2025, గురువారంభారత్ సమాచార్