భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, నవంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

మీడియా సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్ పి. ప్రావీణ్య

3

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్ లోని డిపిఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సీ.ఎం.సీ)ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి. ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన అనుమతులు మంజూరు చేయాలని ఆమె సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎం సి ఎం సి కమిటీ సభ్యులు, డి పి ఆర్ ఓ, విజయలక్ష్మి,అడిషనల్ పి ఆర్ ఓ ఏడుకొండలు,మీడియా ప్రతినిధులు,డి పి ఆర్ ఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.