భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్ లోని డిపిఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సీ.ఎం.సీ)ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి. ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా…