భారత్ సమాచార్, మహబూబాబాద్: మండల కేంద్రం ఇనుగుర్తిలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ.. తన జీవితకాలం తెలంగాణ విముక్తి కోసం పోరాడుతూ, అక్షరాలనే ఆయుధంగా మలిచి నవాబ్ పాలకులకు ధిక్కార స్వరం వినిపించిన మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు.

కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో అదృష్టకరమని కట్టయ్య అన్నారు. తెలంగాణ ప్రజల భాష, యాస, సంస్కృతి, జీవన…