భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపగాని మధుకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు దాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన మధు ఈ నెల 22వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చులు అధికంగా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది.

…