భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సురక్షితంగా గమ్యం చేరుకోవడంలో అందరూ బాధ్యత వహించాలని ఎస్సై చిర్ర రమేష్ బాబు అన్నారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని జీజేసీలో పోలీస్ శాఖ, ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అరైవ్ అలైవ్ నినాదం ప్రాధాన్యత సంతరించుకుందని ఎస్సై రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం సేవించి వాహనం నడపడమేనని, ఇది కుటుంబాలను విచ్ఛిన్నం…