భారత్ సమాచార్.నెట్, మెదక్: పేద యువతి వివాహానికి మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా ఉదారతను చాటుకున్నారు. శివంపేట మండలంలోని పోతులబోగూడ గ్రామానికి చెందిన కోల్చెల్మ మల్లేష్, సాలమ్మ కుమార్తె శిల్ప పెళ్లికి ఆయన అండగా నిలిచారు. శిల్ప వివాహానికి అవసరమైన పుస్తె మెట్టెలను ఆయన ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శరభయ్య, పెంటగౌడ్ సహా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదింటి ఆడపడుచు వివాహానికి గుప్తా చేసిన సహాయాన్ని గ్రామస్థులు అభినందించారు.
పుస్తె మెట్టెలు అందజేత





